Kadapaలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గట్టురట్టు

ABN , First Publish Date - 2021-12-12T16:54:29+05:30 IST

జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Kadapaలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గట్టురట్టు

కడప: జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు కరుడుగట్టిన హర్యానా రాష్ట్రానికి చెందిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఏటీఎంల చోరీకి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, అత్యాధునిక పరికరాలతో పాటు, లారీ,  9.5 లక్షల నగదు, 2 నాటు తుపాకులు, 20 కేజీల గంజాయి, 40 క్వార్టర్ బాటిళ్ళ అంతరాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  నగరంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నేరగాళ్లను ఎస్పీ అన్బురాజన్ మీడియా ఎదుట హాజరుపరచి వివరాలను వెల్లడించారు. సీకేదిన్నె మండలంలోని కెఎస్ఆర్ఎం కళాశాల ప్రాగణంలోని ఏటీయం, చిన్నచౌకు పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలీస్ స్టేషన్లలో చోరీలకు పాల్పడినట్లు ఎస్పీవెల్లడించారు. చోరీలకు పాల్పడిన మేవాట్ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. వీరిపై పలు రాష్ట్రాల్లో, జిల్లాల్లో కేసులు నమోదైనట్లు చెప్పారు. పారిపోయే క్రమంలో రాజంపేటలో దొంగలు అడ్డంగా దొరికిపోయారన్నారు. చిన్న ఆధారం లేకపోయినా కేసును క్షేదించడంలో కీలక పాత్ర పోషించిన సీఐలు, ఎస్ఐలు, హాంగార్డులపై ఎస్పీ అన్బురాజన్ ప్రసంశల జల్లులు కురిపించారు. 

Updated Date - 2021-12-12T16:54:29+05:30 IST