కడప: జిల్లాలోని మైదుకూరులో డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. పాత అప్పుల పేరుతో జగనన్న ఆసరా పథకం లబ్ధిదారులకు ఇవ్వలేదని నిరసన చేపట్టారు. వెలుగు కార్యాలయ సిబ్బందితో డ్వాక్రా మహిళలు వాగ్వాదానికి దిగారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా... ఆసరా డబ్బులను చెల్లించాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ సంబంధిత మహిళలు ఆరోపిస్తున్నారు. రెండవ విడతగా బ్యాంకులో జమ అయిన ఆసరా పథకం డబ్బులు తీసుకునేందుకు వీలు లేకుండా చేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి