కడప జిల్లా: చెయ్యేరునది వరదకు గురైన గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయా గ్రామాల్లో నామమాత్రంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులపత్తూరు, మందపల్లె, తొగురుపేట గ్రామాల్లో వరదలకు అపార నష్టం సంభవించింది. పల్లెలు ఇసుకదిబ్బలు, రాళ్ళగుట్టలుగా మారాయి. చెయ్యేరునది పక్కన ఉన్న 8 వందల ఇళ్లకుపైగా దెబ్బతిన్నాయి. నివాసితులు నిరాశ్రయులై కన్నీరు మున్నీరవుతున్నారు. 1.23 హెక్టార్లలలో వేసిన పలు రకాల పంటలు నీటిపాలయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.