
కడప: నగరంలో అధికార పార్టీ నేతల మధ్య నిధుల స్వాహా గొడవలు జరిగాయి. కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్‌ను వైసీపీ కార్పొరేటర్లు నిలదీశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు, కమిషనర్ మధ్య వాగ్వివాదం జరిగింది. అధికార పార్టీ నేతలు, అధికారులు కలసి నిధులు గోల్మాల్ చేశారని, కార్పొరేటర్లకు కేటాయించిన నిధులు కూడా స్వాహా చేశారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష కార్యాలయంలో కమిషనర్‌కు కార్పొరేటర్లకు మద్య వాగ్వివాదం జరిగింది.