ప్రారంభానికి నోచుకోని ‘నాడు-నేడు పనులు

ABN , First Publish Date - 2020-10-27T08:09:34+05:30 IST

పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత (మెయిన్‌) పాఠశాలలో ‘నాడు-నేడు పనులను నేటికీ ప్రారంభించలేదు.

ప్రారంభానికి నోచుకోని ‘నాడు-నేడు పనులు

 పాడా నిధులతో నిర్మించేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు 

 పెరుగుతున్న అడ్మిషన్లు.. విద్యార్థులను మరో పాఠశాలకు తరలించే యోచన


పులివెందుల రూరల్‌, అక్టోబరు 26: పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత (మెయిన్‌) పాఠశాలలో ‘నాడు-నేడు పనులను నేటికీ ప్రారంభించలేదు. ఈ ఏడాది జూన్‌ 4న హెటిరో కంపెనీ ఆధ్వర్యంలో భూ మిపూజ చేశారు. సుమారు రూ.కోటి నిధులు వెచ్చించి పాఠశాల నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని పా త పాఠశాల తరగతి గదులను పూర్తిగా కూల్చివేశారు. హెటిరో కంపెనీ పాఠశాలకు 25 గ్రీన్‌ బోర్డులు (ఒక్కో తరగతి గదికి ఒకటి చొప్పున) కూడా సమకూర్చింది. నిర్మాణాలు చకాచకా సాగుతాయని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భావించారు. కానీ దాదాపు ఐదు నెలలు కావస్తున్నా నూతన భవన నిర్మాణాలు ప్రారంభం కాలేదు. మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేస్తామని చెప్పిన హెటిరో కంపెనీ ఐదు నెలలు అయినా పనులు ప్రారంభించకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధు లు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో హెటిరోను తప్పించి పులివెందుల ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (పాడా) నిధుల కింద పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.


కలెక్టర్‌ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లకు పిలిచి పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభు త్వం నవంబరు నెలలో పాఠశాలలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుండంతో 540 మందికి పైగా ఉన్న విద్యార్థులకు తరగతులు ఎలా నిర్వహించాలనే అయోమయంలో ఉన్న ట్లు తెలుస్తోంది. ప్రస్తు తం పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయని పాఠశా ల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌ తెలిపారు. కొంతమంది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి తమ పాఠశాలలో అడ్మిషన్లు పొందుతున్నారని, పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీలు ఇవ్వకపోవడంతో పేర్లు మాత్రమే నమోదు చేసుకుంటున్నామని, టీసీలు ఇస్తే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 


ప్రస్తుతం పాఠశాల గ్రంథాలయం భవనం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు ప్రారంభిస్తే విద్యాబోధన ఎలా సాగుతుందనే విషయమై మండల విద్యాశాఖ అధికారి వీరారెడ్డిని వివరణ కోరగా ప్రస్తుతం విద్యార్థుల సం ఖ్య పెరుగుతోందని, ఇందుకు ప్రత్యామ్నయంగా పట్టణంలోని మరో ఉన్నత పాఠశాల అయిన సత్రం హైస్కూల్‌ తరగతి గదుల్లో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-27T08:09:34+05:30 IST