Kadapa: ఉద్యోగుల ప్రాణాలమీద మీదకొస్తున్న ఓటీఎస్

ABN , First Publish Date - 2022-02-01T15:51:45+05:30 IST

ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ విధానం ఉద్యోగుల ప్రాణాలమీదకొస్తోంది.

Kadapa: ఉద్యోగుల ప్రాణాలమీద మీదకొస్తున్న ఓటీఎస్

కడప: ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్ విధానం ఉద్యోగుల ప్రాణాల మీదకొస్తోంది. ఓటీఎస్‌లు చేయించేందుకు కిందిస్ధాయి ఉద్యోగులపై ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిళ్ళు తీసుకువస్తున్నారు. ఈ ఒత్తళ్లను తాళలేక రాజంపేట మండలం తాళ్ళపాక వీఆర్ఓ రాఘవ చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రాజంపేట ఓటీఎస్ స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య వేధింపులతో రాఘవ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సెల్ఫీవీడియో ద్వారా బ్రహ్మయ్యపై వీఆర్ఓ రాఘవ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Updated Date - 2022-02-01T15:51:45+05:30 IST