పులివెందుల పీఎస్లో డ్రైవర్ దస్తగిరిపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-12-08T02:12:34+05:30 IST
జిల్లాలోని పులివెందుల పీఎస్లో డ్రైవర్ దస్తగిరిపై ఫిర్యాదు చేశారు. డ్రైవర్ దస్తగిరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని పులివెందుల వాసి శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడప: జిల్లాలోని పులివెందుల పీఎస్లో డ్రైవర్ దస్తగిరిపై ఫిర్యాదు చేశారు. డ్రైవర్ దస్తగిరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని పులివెందుల వాసి శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దస్తగిరి దగ్గర డబ్బులు అప్పుతీసుకొని శ్రీరాములు చెల్లించారు. కొంత వడ్డీ డబ్బులు ఇవ్వలేదని దస్తగిరి ట్రాక్టర్ ఇంజన్ తీసుకెళ్లాడు. దాంతో శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపు ఇరువురినీ పీఎస్కు రావాలని పోలీసులు తెలిపారు.