కడప స్పందనతోనైనా..కళ్లు తెరువు

ABN , First Publish Date - 2022-05-20T05:13:43+05:30 IST

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన స్పందనతోనైనా కళ్లు తెరచి నియంత పాలనకు స్వస్తి చెప్పాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి సీఎం జగన్‌కు హితవు పలికారు.

కడప స్పందనతోనైనా..కళ్లు తెరువు
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి

 సీఎం జగన్‌కు టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి హితవు 

చంద్రబాబు పర్యటన సక్సెస్‌తో ఆనందోత్సాహాల్లో ఆ పార్టీ నాయకులు

ప్రొద్దుటూరు క్రైం, మే 19 : బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన స్పందనతోనైనా కళ్లు తెరచి నియంత పాలనకు స్వస్తి చెప్పాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి సీఎం జగన్‌కు హితవు పలికారు. ఈ మేరకు గురువారం ఆయన తన కార్యాలయం లో విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు పర్యటన స్పందన చూస్తే 40 ఏళ్ల క్రితం రామారావుకు వచ్చిన స్పందనను గుర్తుకు తెస్తుందన్నారు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అనేది స్పష్టమైందన్నారు. వైసీపీ పాలనలో కేవలం కక్షసాధింపు తప్ప, పరిపాలన అనేది లేదన్నారు. కరెంట్‌ చార్జీల పెంపు, కరెంట్‌ కోతలు, ఆర్టీసీ చార్జీల బాదుడు, నీటితీరువా పన్ను వసూ లు, ఆస్తిపన్ను పెంపు, చెత్త వసూలు చేపట్టడం లాంటి వాటితో ప్రజల జీవితాలతో జగన్‌ సర్కార్‌ ఆడుకుంటోందన్నారు. గడప గడపకు వైసీపీ, మంత్రుల బస్సుయాత్ర ఏవీ కూడా వైసీపీ పరాజయాన్ని ఆపలేవన్నారు. సమావేశంలో తెలుగుమహిళ రాష్ట్ర కార్యదర్శి మల్లెల లక్ష్మీప్రసన్న, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సానా విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్‌, మాజీ కౌన్సిలర్‌ జి.సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సభ సక్సెస్‌ హర్షణీయం... పుట్టా

మైదుకూరు, మే 19 : చంద్రబాబు నిర్వహించిన ఖాజీపేట సభను ప్రజలందరూ పాల్గొని సక్సెస్‌ చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983 నుంచి ఖాజీపేటలో ఏ సభ నిర్వహించినా  ఇంత జనం రాలేదన్నారు. జనాన్ని చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉందో చెప్పవచ్చని, కార్యాకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

చంద్రన్నకు జనం నీరాజనం 

Updated Date - 2022-05-20T05:13:43+05:30 IST