కైగల్‌ పరవళ్లు

Sep 22 2021 @ 01:03AM
కైగల్‌ జలపాతంలో శివలింగంపై ఎగిసిపడుతున్న నీటిప్రవాహం

బైరెడ్డిపల్లె, సెప్టెంబరు 21: బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్‌ దుముకురాళ్ల జలపాతం పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తోంది. సోమవారం రాత్రి కురిసిన భారీవర్షానికి వరదనీరు పోటెత్తడంతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం వద్ద వున్న శివలింగానికి జలాభిషేకం చేస్తున్నట్లుగా ఎగసిపడుతున్న నీటిఉధృతి పరిసరాలను ప్రతిధ్వనింపజేస్తోంది. కాగా రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వి.కోట మండలంలో వాగులు, వంకలు, చెరువులన్నీ నిండి పరవళ్ళు తొక్కుతున్నాయి.కుమ్మరమడుగు వద్ద హైవేపై నీరు నిలిచి రాత్రంతా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది.వరద నీరు ఎగువనున్న చెరువుల నుంచి హంద్రీ-నీవా కాల్వలోకి రావడంతో గండి పడి దిగువనున్న పొలాలపై ప్రవహించడంతో పంటలు నీట మునిగాయి.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.