కైకాల పద్మ అవార్డుకు అర్హులు కారా: నెటిజన్ల ప్రశ్న

Published: Thu, 27 Jan 2022 16:34:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కైకాల పద్మ అవార్డుకు అర్హులు కారా: నెటిజన్ల ప్రశ్న

పురస్కారం అనేది కళాకారులకు గొప్ప గౌరవమే కాదు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లడానికి ఓ ఆయుధం.   ఎనలేని ఎనర్జీని నింపే ఔషదం. అందుకే కళాకారులకు ఓ చిన్న పురస్కారం వచ్చినా కష్టానికి తగిన ప్రతిఫలం అనీ, నటనకు చక్కని గుర్తింపు అని ఆనందిస్తుంటారు. తెలుగుతెరపై అద్భుతమైన నటన కనబర్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎందరో నటులు ఉన్నారు. అందులో కొందరు ప్రతిభ కొద్దీ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. ప్రతిభ, గుర్తింపు ఉండీ ఎలాంటి పురస్కారాలకు నోచుకోనివారు ఉన్నారు. పలు సిఫార్సుల మేరకు  కొందరు అవార్డులు అందుకున్నారు. అర్హత లేని ఎంతోమంది ఈతరం నటులకు అవార్డులు వస్తున్నాయనే విమర్శ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ ఎదురవుతుంది. అలాంటి విమర్శే ఈ ఏడాది పద్మ పురస్కారాలు ప్రకటించినప్పుడు ఎదురైంది. 


సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ సినీ కెరీర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్లకుపైగా సినీ జీవితం, 750కు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపో గల ప్రతిభ, ఎలాంటి డైలాగ్‌నైనా అనర్గళంగా చెప్పగలిగే గళం, నవరస నటనాసార్వభౌముడు అని ముద్దుగా పిలిపించుకున్న కళామతల్లి ముద్దు బిడ్డ.. ఇన్ని అర్హతలు ఉన్న నటుడు పద్మ అవార్డుకు అర్హులు కారా? ఇదే ప్రస్తుత చర్చ. సగటు తెలుగు ప్రేక్షకుడి ఆవేదన, రెండు రోజులుగా ప్రభుత్వాలను నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలివి. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కైకాల సత్యనారాయణను పద్మ అవార్డుకు అర్హులు కారా? రాష్ట్ర విభజనకు ముందుగానీ, తరువాత కానీ ఆయన పేరును పద్మ అవార్డుకు ప్రభుత్వాలు ఎందుకు సిఫార్సు చేయలేకపోయాయి? ప్రతిభకు పట్టం కడితేనే కదా సినీ పరిశ్రమ మరింత కలర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం కొందరు ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. అంతే కాదు కైకాల లాంటి ఎంతోమంది సీనియర్లు ప్రతిభ ఉండి కూడా సరైన గుర్తింపునకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International