అజయ్ దేవగణ్‌తో కాజల్ ..?

Jun 9 2021 @ 13:25PM

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో కాజల్ జతకట్టబోతోందని ప్రస్తుతం న్యూస్ ఒకటి బీ టౌన్ మీడియాలో వైరల్ అవుతుందట. తమిళంలో లోకేష్ కనగ్‌రాజ్ దర్శకత్వంలో కార్తి నటించిన 'ఖైదీ' చిత్రాన్ని హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన సరసన కాజల్‌ని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. తమిళ వర్షన్‌లో హీరోయిన్ పాత్ర ఉండదు. తెలుగులోనూ డబ్ అయిన ఈ చిత్రం ఇక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే హిందీ రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్రను క్రియేట్ చేశారట. ఆ పాత్రలో కాజల్ మెరవనుందని చెప్పుకుంటున్నారు. గతంలో అజయ్ దేవగణ్ - కాజల్ జంట 'సింగం'లో అలరించింది. కాగా ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి సరసన 'ఆచార్య', 'నాగార్జున' సరసన ఓ సినిమా అలాగే కమల్ హాసన్ సరసన 'ఇండియన్ 2' చేస్తోంది.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.