Advertisement

`ఆచార్య`.. కాజల్ చివరి సినిమానా?

Oct 17 2020 @ 16:40PM

చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తను ప్రేమించిన గౌతమ్ కిచ్లూను ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోబోతోంది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్ వెల్లడించింది. అయితే ఇప్పటికే అంగీకరించిన సినిమాలు మాత్రమే కాజల్ పూర్తి చేస్తుందని సమాచారం. 


కమల్ హీరోగా తెరకెక్కుతున్న `ఇండియన్-2`, మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` సినిమాలు ప్రస్తుతం కాజల్ చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత కాజల్ బ్రేక్ ఇవ్వబోతోందట. ఆ తర్వాత మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో మాత్రమే నటించాలని అనుకుంటోందట. ఈ నేపథ్యంలో `ఆచార్య` సినిమానే కాజల్ చివరి కమర్షియల్ చిత్రమని టాక్ వినిపిస్తోంది. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.