
ప్రభుదేవా, కాజల్ అగర్వాల్ జంటగా ఓ తమిళ చిత్రం చేయబోతున్నారని కోలీవుడ్ టాక్. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ తెరకెక్కిస్తారట. పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇంతకు ముందు డీకే దర్శకత్వంలో హారర్ చిత్రంలో కాజల్, ప్రభుదేవా జంటగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ ప్రకటించాక చిత్రబృందం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు