ఇటీవల పెళ్లి చేసుకున్న దక్షిణాది కథానాయిక కాజల్ అగర్వాల్ - కిచ్లూ దంపతులు మాల్దీవులులో హానీమూన్‌ను ముగించుకొచ్చారు. ఇప్పుడు కాజల్ తన చిత్రాల షూటింగ్‌పై దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’, మంచు విష్ణు చిత్రం ‘మోసగాళ్లు’లో నటిస్తున్నారు. తమిళంలో కమల్‌హాసన్, శంకర్ కాంబోలో ‘ఇండియన్ 2’లో, బాలీవుడ్లో ‘ముంబై సాగా’ చిత్రంలో, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘హే సినామికా’లోనూ కథానాయికగా కాజల్ నటిస్తున్నారు. ఇప్పటికే బిజీగా ఉన్న కాజల్ తాజాగా మరో తమిళ హారర్ చిత్రాన్ని అంగీకరించారు. ఈ చిత్రానికి డీకే దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘కావలై వేందామ్’ వచ్చింది. ఆయన చెప్పిన కథ నచ్చడంతో కాజల్ వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారట. కొత్త చిత్రం కోసం చెన్నైలో జరిగిన ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తను మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నట్టు కాజల్ చెప్పారు. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలు నటిస్తున్నారు. అందులో కాజల్ ఒకరు. మిగిలిన కథానాయికలను ఎంపికచేసే పనిలో డీకే ఉన్నారు.