కాజు పనీర్‌ మసాలా

ABN , First Publish Date - 2020-02-24T16:59:09+05:30 IST

పనీర్‌ - 12 క్యూబ్స్‌, జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు పేస్టు - పావు కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, వెన్న - ఒక టీ స్పూను, బిర్యాని ఆకు - 1, లవంగాలు - 3,

కాజు పనీర్‌ మసాలా

కావలసిన పదార్థాలు: పనీర్‌ - 12 క్యూబ్స్‌, జీడిపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు పేస్టు - పావు కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, వెన్న - ఒక టీ స్పూను, బిర్యాని ఆకు - 1, లవంగాలు - 3, యాలకులు - 2, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, ఉల్లిపాయ పెద్దది - ఒకటి, పసుపు - అర టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాలపొడి - 1 టీ స్పూను చొప్పున, జీరాపొడి, గరం మసాల పొడి - పావు టీ స్పూను చొప్పున, టమాటా గుజ్జు - ఒకటిన్నర కప్పులు, క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర - అరకప్పు, కసూరి మేతి - ఒక టీ స్పూను.

తయారుచేసే విధానం : పాన్‌లో నూనె వేసి పనీర్‌, 2 టేబుల్‌ స్పూన్ల జీడిపప్పుల్ని విడిగా వేగించి పక్కనుంచాలి. ఇప్పుడు వెన్నవేసి బిర్యాని ఆకు, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఉల్లితరుగు, అల్లం వెలుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీరాపొడి, గరం మసాల, ఉప్పు ఒకటితర్వాత ఒకటి వేయాలి. తర్వాత టమాటా గుజ్జు కలిపి పది నిమిషాలు వేగించాలి. నూనె తేలిన తర్వాత 2 టేబుల్‌ స్పూన్ల జీడిపుప్పు పేస్టు, క్రీమ్‌ వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడ్డాక పావుకప్పు నీరుపోయాలి. 5 నిమిషాల తర్వాత వేగించిన పనీర్‌, కాజు కలపాలి. తర్వాత కసూరి మేతి వేసి మరోసారి కలిపి కొత్తిమీర చల్లాలి. 

Updated Date - 2020-02-24T16:59:09+05:30 IST