ఆధారాలు సమర్పించమని ఇద్దరికీ చెప్పాం: కాకాని గోవర్ధన్‌రెడ్డి

Sep 21 2021 @ 14:47PM

అమరావతి: అచ్చెన్నాయుడు, నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్న, నిమ్మలపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇస్తామన్నారు. నోటీసులు తీసుకునే సమయంలో తాను అందుబాటులో లేనని కూన రవి చెబుతున్నారని, అందుబాటులోనే ఉన్నారని ఫిర్యాదు దారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆధారాలు సమర్పించమని ఇద్దరికీ చెప్పామన్నారు. ఆధారాల పరిశీలన అనంతరం కూన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూడదనేం లేదన్నారు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోయిండొచ్చన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.