ఖర్చులు తగ్గితేనే వ్యవసాయం లాభసాటి

ABN , First Publish Date - 2021-12-06T05:42:50+05:30 IST

వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు ఖర్చులు తగ్గించాలని పొగాకుబోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు అన్నారు.

ఖర్చులు తగ్గితేనే వ్యవసాయం లాభసాటి
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఆడిటర్‌ మస్తానయ్య

పొగాకు బోర్డు చైర్మన్‌ రఘునాదబాబు

గుంటూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు ఖర్చులు తగ్గించాలని పొగాకుబోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు అన్నారు. అమరావతి రోడ్డు మోతడకలో ఆదివారం కాకతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ యర్రానాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రామాల్లో వ్యవసాయం లాభసాటిగా లేదని పట్టణాలు, నగరాలకు వలసలు పెరుగుతున్నట్లు చెప్పారు. కాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ చేపట్టే కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు. మాజీ ఎమ్మెల్సీ  ఏఎస్‌ రామకృష్ణ మాట్లాడుతూ కాకతీయ సేవాసమితి పేద పిల్లల విద్యాభివృద్ధికి సాయం చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలు గోరంట్ల పున్నయ్యచౌదరి, సామినేని కోటేశ్వరరావు, కొత్తపల్లి రమేష్‌చంద్ర, ఘంటా పున్నారావు, మదమంచి నాగేశ్వరరావు, గింజుపల్లి శ్రీనాథ్‌చౌదరి, మిర్చియార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, విశ్రాంత లెక్చరర్‌ జీవీ రాయుడు, బొల్లేపల్లి సత్యన్నారాయణ, ఉమామహేశ్వరరావు, బీవీ అప్పారావు, రాణి, మువ్వా వేణుబాబు, గుమ్మడి రాదాకృష్ణ, పోలు నరసయ్య, కాట్రగడ్డ శ్యామ్‌బాబు, నాగమల్లేశ్వరరావు, కొత్తపల్లి రవీంద్ర తదితరులు మాట్లాడుతూ కాకతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి అందరు సహకరించాలని కోరారు. ఆడిటర్‌ సీహెచ్‌ మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మల్లెల హరీంద్రనాథ్‌చౌదరి, బండ ్లపున్నారావు, డీసీసీబీ పాలకవర్గ సభ్యుడు కోట హరిబాబు, వికాస్‌ ఆగ్రోస్‌ అధినేత కనగాల సత్యన్నారాయణ, పిడికిటి తిలక్‌బాబు, విశ్రాంత  డీఎంహెచ్‌వో డాక్టర్‌ బొల్లినేని పూర్ణచంద్రరావు, డాక్టర్‌ పాతూరి కిరణ్‌ చౌదరి, డాక్టర్‌ యర్రా రాజేష్‌, కొర్రపాటి రామారావు, కోల్డ్‌స్టోరేజ్‌ అసోసి యేషన్‌ కార్యదర్శి పి.సురేంద్ర, ఇంకొల్లు మాజీ సర్పంచ్‌ నాయుడమ్మ, కొమ్మినేని ప్రసాద్‌, కార్పొరేటర్‌ కోటేశ్వరరావు, బాలాజీ, సుఖవాసి శ్రీనివాసరావు, రవీంద్ర, పి.సుబ్రమణ్యం, కె.బుచ్చయ్యచౌదరి, వలరాజు, నాగార్జున చౌదరి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-06T05:42:50+05:30 IST