మా వంశస్తుల గడ్డకు రావడం సంతోషం: Kakatiya వారసుడు

ABN , First Publish Date - 2022-07-07T18:41:41+05:30 IST

‘‘మా వంశస్తుల గడ్డకు రావడం సంతోషం’’ అని కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ(kamal chandra bhaj dev kakatiya) అన్నారు.

మా వంశస్తుల గడ్డకు రావడం సంతోషం: Kakatiya వారసుడు

వరంగల్: ‘‘మా వంశస్తుల గడ్డకు రావడం సంతోషం’’ అని కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ(kamal chandra bhaj dev kakatiya) అన్నారు. గురువారం కాకతీయ(Kakatiya) వైభవ సప్తాహం ఉత్సావాలను ప్రారంభించేందుకు కమల్ చంద్ వరంగల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కాకతీయ వారసుడు మీడియాతో మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇక్కడ నుండి వెళ్ళినా బస్తర్‌లో సమాజసేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాకతీయ ఉత్సవాలు జరపడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ  ధన్యవాదాలు తెలియజేశారు. 

Updated Date - 2022-07-07T18:41:41+05:30 IST