Kakinadaలో పూరిళ్లు తొలగించేందుకు యత్నం... అడ్డుకున్న స్థానికులు

ABN , First Publish Date - 2022-06-10T14:54:57+05:30 IST

కాకినాడ ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా ఉన్న 90 పూరిళ్ళను తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది యత్నించారు.

Kakinadaలో పూరిళ్లు తొలగించేందుకు యత్నం... అడ్డుకున్న స్థానికులు

కాకినాడ: కాకినాడ ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా ఉన్న 90 పూరిళ్ళను తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది యత్నించారు. వారిని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా... వీరంతా ఆక్రమించి పాకలు వేసుకున్నారని, ఇప్పటికే ఈ 90 మందికి పండూరులో ఇళ్ళు కేటాయించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాత్రి పట్టాలు ఇచ్చి ఉదయం ఎలా ఖాళీ చేస్తామని యజమానులు ప్రశ్నించారు. పోలీసులు, సచివాలయ సిబ్బందితో ఖాళీ చేయించడానికి మున్సిపల్ కమిషనర్ యత్నిస్తుండగా... జనసేన నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2022-06-10T14:54:57+05:30 IST