క్రీడలతో వ్యాయామం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-06-29T06:11:11+05:30 IST

కాకినాడ స్పోర్ట్స్‌, జూన్‌ 28: ప్రతిరోజు ఒక గంట ఏదోఒక క్రీడలో పాల్గొనడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం అందుతుందని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. మంగవారం లేడీ్‌సక్లబ్‌ ఆవరణలోని ద్రోణాచార్య బ్యాడ్మింటన్‌ అకాడమీలో వేసవి శిక్షణా శిబిరం ముంగిపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. బ్యాడ్మింటన్‌లో రాణించి జిల్లాకు మంచి పేరుతేవాలని కోరా

క్రీడలతో వ్యాయామం: కలెక్టర్‌
క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న కలెక్టర్‌

కాకినాడ స్పోర్ట్స్‌, జూన్‌ 28: ప్రతిరోజు ఒక గంట ఏదోఒక క్రీడలో పాల్గొనడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం అందుతుందని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. మంగవారం లేడీ్‌సక్లబ్‌ ఆవరణలోని ద్రోణాచార్య బ్యాడ్మింటన్‌ అకాడమీలో వేసవి శిక్షణా శిబిరం ముంగిపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. బ్యాడ్మింటన్‌లో రాణించి జిల్లాకు మంచి పేరుతేవాలని కోరారు. అకాడమీ డైరెక్టర్‌ రంగబాబు మాట్లాడుతూ ఏప్రిల్‌ 10 నుంచి జూన్‌ 26 వరకు నిర్వహించిన శిబిరంలో 80 మంది క్రీడాకారులు తర్ఫీదు పొందారన్నారు. లేడీ్‌సక్లబ్‌ ప్రతినిధులు బొడ్డు సత్యవతి, పురం మమత, అనురాధ, నేమాని లక్ష్మి, ద్రోణాచార్య బ్యాడ్మింటన్‌ అకాడమీ చైర్మన్‌ గమిని చిన్న రాజా, కోచ్‌లు మూర్తి తురంగి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:11:11+05:30 IST