పనివేళలు మార్చండి.. భారం తగ్గించండి

ABN , First Publish Date - 2021-03-02T05:54:07+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 1: పని వేళలు మార్చాలని, పని భారం తగ్గించాలని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది విన్నవించారు. ఈ మేరకు సోమవారం కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కార్పొరేషన్‌ కార్యాలయంలో కలిసి తమ సమస్యలు తెలిపారు. ఇటీవ

పనివేళలు మార్చండి.. భారం తగ్గించండి
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌

కమిషనర్‌కు విన్నవించిన సచివాలయ సిబ్బంది 

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 1: పని వేళలు మార్చాలని, పని భారం తగ్గించాలని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది విన్నవించారు. ఈ మేరకు సోమవారం కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కార్పొరేషన్‌ కార్యాలయంలో కలిసి తమ సమస్యలు తెలిపారు. ఇటీవల సచివాలయ సిబ్బందిని స్వచ్ఛత రాయబారులుగా నియమించి ఆయా పరిధిలో ఇంటింటికి వెళ్లి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై నగర ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్‌ సూచించారు. దీనిపై కమిషనర్‌ను సచివాలయ సిబ్బంది కలిశారు. ‘మీ సమయపాలన మార్చుకోండి కానీ మీకు కేటాయించిన ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే’ అని కమిషనర్‌ స్పష్టం చేశారు. రోడ్లపై చెత్త వేయకుండా పారిశుధ్య కార్మికులకు తడి, పొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా రోడ్ల మీద ఇంటిలోని చెత్తను వేస్తే ఆ ప్రాంత శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు సమాచారం అందించి అవసరమైతే ఆ గృహాల యజమానులకు అపరాధ రుసుం విధించాలని ఆయన సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మాత్రం రాజీపడేది లేదని సచివాలయ సిబ్బందికి కమిషనర్‌ తేల్చి చెప్పేశారు. 

Updated Date - 2021-03-02T05:54:07+05:30 IST