యండమూరు మీసాల వెంకన్న పాదాలను తాకిన సూర్యకిరణాలు

ABN , First Publish Date - 2022-09-04T02:27:38+05:30 IST

కాకినాడ జిల్లా కరప మండలం యండమూరులో అత్యంత ప్రాశస్త్యం కలిగిన సామ్రాజ్యలక్ష్మి, గోదాదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో

యండమూరు మీసాల వెంకన్న పాదాలను తాకిన సూర్యకిరణాలు

కాకినాడ: కాకినాడ జిల్లా కరప మండలం యండమూరులో అత్యంత ప్రాశస్త్యం కలిగిన సామ్రాజ్యలక్ష్మి, గోదాదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైది. మీసాల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. అలాగే పక్కనే ఉన్న అమ్మవార్ల విగ్రహాలపై కూడా ఈ సూర్యకిరణాలు పడి దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చాయి. విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏటా బాద్రపద మాసంలో సప్తమ తిధి నాడు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయని, మూడురోజుల బాటు ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేస్తుందని ఆలయ ప్రధానార్చకుడు పెద్దింటి సీతారామాచార్యులు తెలిపారు.

Updated Date - 2022-09-04T02:27:38+05:30 IST