జనావాసాల మధ్య వెహికల్‌ యార్డ్‌ను తొలగించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:40:00+05:30 IST

కాకినాడ సిటీ, జనవరి 28: జగన్నాథపురం ఏటిమొగ రాజీవ్‌ గృహకల్ప అపార్టుమెంట్లలో జనావాసాల మధ్య డంపింగ్‌ వెహికల్‌ యార్డ్‌ను తొలగించాలని స్థానిక మహిళలు పెద్దసంఖ్యలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ వెహికల్‌ యార్డ్‌ ద్వారా వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనను భరిం

జనావాసాల మధ్య వెహికల్‌ యార్డ్‌ను తొలగించాలి
మహిళలతో కలిసి మాట్లాడుతున్న కొండబాబు

కాకినాడలో మహిళల ఆందోళన 

కాకినాడ సిటీ, జనవరి 28: జగన్నాథపురం ఏటిమొగ రాజీవ్‌ గృహకల్ప అపార్టుమెంట్లలో జనావాసాల మధ్య డంపింగ్‌ వెహికల్‌ యార్డ్‌ను తొలగించాలని స్థానిక మహిళలు పెద్దసంఖ్యలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ వెహికల్‌ యార్డ్‌ ద్వారా వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనను భరించలేకపోతున్నామని వాపోయారు. విషయం తెలుసుకున్న కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మహిళలు మాట్లాడుతూ చుట్టూ జనావాసాల మధ్య డంపింగ్‌ వెహికల్‌ యార్డ్‌ ఏర్పాటు చేసి ప్రహారీ గోడకు ఎలక్ట్రికల్‌ ఫెన్సింగ్‌ అమర్చారన్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులుగానీ ప ట్టించుకోవడం లేదన్నారు. కొండబాబు మాట్లాడుతూ డంపింగ్‌ వెహికల్స్‌ కోసమే అయితే ఈ యార్డ్‌ చుట్టూ ఎలక్ట్రికల్‌ ఫెన్సింగ్‌ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇటువంటి యార్డ్‌లను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మల్లాడి రాజేశ్వరి, సంగాని గాంధీ, సీకోటి సింగ్‌, అరదాడి శివ, మల్లాడి చిన్న, సతీష్‌, కామాడి సుబ్బారావు, వనమాడి ధర్మారావు, సేరు శ్రీను, పరశురామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:40:00+05:30 IST