కాసుల కోసం కక్కుర్తి

ABN , First Publish Date - 2021-04-24T05:06:39+05:30 IST

కొలిచే దేవుడికన్నా, ప్రాణం పోసే వైద్యులే మిన్న.. ప్రస్తుత కరోనా విపత్తులో వారే అందరికీ అండ, దండా..

కాసుల కోసం కక్కుర్తి

- ‘రెమ్‌డెసివిర్‌’ను కృత్రిమ కొరత సృష్టిస్తున్న  ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులు 

- సిడికేట్‌గా మారిన యాజమాన్యాలు

- బ్లాక్‌లో రూ.10 వేలకు విక్రయాలు 

- బాధితుల నుంచి ముక్కు పిండి వసూలు 

- మొద్దు నిద్రలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం), ఏప్రిల్‌ 23 : కొలిచే దేవుడికన్నా, ప్రాణం పోసే వైద్యులే మిన్న.. ప్రస్తుత కరోనా విపత్తులో వారే అందరికీ అండ, దండా.. కానీ, కాసుల కోసం కొందరు కక్కుర్తి పడుతున్నారు.. డబ్బుల వేటలో విలువలను పోగొట్టుకుంటున్నారు.. కరోనా బాధితులకు అందించే చికిత్సలో అత్యసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజక్షన్‌ను ఉచితంగానే బాధితులకు ఇస్తున్నా, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు అమ్ముతున్నారు.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు సిండికేట్‌గా మారి, కృత్రిమ కొరతను సృష్టించి ఇంజక్షన్‌ పేరుతో వ్యాపారాలు చేస్తున్నాయి.. ఇదంతా బాహటంగానే జరుగుతున్నా, ఔషధ నియంత్రణ శాఖ ఆవలిస్తూ నిద్రపోతోంది..

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐ దు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తి త్వరగా కోలుకునేందుకు ఈ ఇంజక్షన్‌ చాలా ఉపయోగ పడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజక్షన్‌ను ఉచి తంగా ఇస్తున్నారు. ప్రైవేట్‌లో మాత్రం దీని ధరను రూ.2,500గా నిర్ణయించారు. అయితే, జిల్లాలో ఇటీవల చా లా మంది బాధితులు ప్రైవేట్‌ ఆసుపత్రులలో చేరు తుండటంతో ఈ ఇంజక్షన్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఇదే అ దునుగా భావించిన ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. ఇంజ క్షన్లు బయట దొరకడం లేదని ప్రజల్లో హైప్‌ను సృష్టించి బ్లాక్‌లో వాటిని విక్రయిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒక వయల్‌కు రూ.2,500 కాగా, ప్రైవేట్‌లో మాత్రం ఒక్కో ఇంజక్షన్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. డబ్బులు సంపాదించుకోవచ్చనే ఉద్దేశ్యం తో అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు సిండికేట్‌గా మారాయి.


నేరుగా కొవిడ్‌ ఆసుపత్రులకే ఇంజక్షన్లు

జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రులకు నేరుగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఆయా కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. రెండు, మూడు రోజులకు ఒకసారి ప్రయివేటు ఆసుపత్రులు ఇం డెంట్‌ పెట్టినంత సరఫరా చేస్తున్నారు. ఈ రెం డు రోజుల్లో జిల్లాలోని ఐ దు కొవిడ్‌ ఆసుపత్రులకు 580 వయల్స్‌ సరఫరా చేసిన ట్లు అధికారిక లెక్కల్లో ఉంది. కానీ, యాజమాన్యాలు మా త్రం సరఫరా లేదని, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌ మార్కెట్‌లో డబ్బులు దండుకోవడానికేనని అర్థమవుతోంది. 


సరఫరా పెంచాలి

కరోనా కేసులు వందల్లో ఉంటున్నాయి. ప్రైవేట్‌ ఆ సుపత్రుల్లో చేరే వారి సంఖ్య అలానే ఉంది. ఒక్కో రోగికి ఆరు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో సర ఫరాను పెంచాలి. ఇదే సాకుతో ప్రైవేట్‌ యాజమాన్యాలు బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారం చేసే అవకాశం కూడా ఉంది. ఇంజక్షన్‌ సరఫరాను పెంచితే వీటికి అడ్డుకట్ట పడి, కరోనా నుంచి ఎంతో మందిని కాపాడవచ్చు.

Updated Date - 2021-04-24T05:06:39+05:30 IST