కళా వెంకట్రావు అరెస్టు అన్యాయం

ABN , First Publish Date - 2021-01-22T05:59:53+05:30 IST

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయడం అన్యాయమని డోన్‌ మండల టీడీపీ అధ్యక్షుడు వెంగనాయునిపల్లి శ్రీను, ఆంజనేయగౌడు, కమలాపురం మధుసూదన్‌బాబు అన్నారు.

కళా వెంకట్రావు అరెస్టు అన్యాయం
డోన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

  1.  టీడీపీ నాయకుల నిరసన


డోన్‌, జనవరి 21: టీడీపీ నాయకుడు,  మాజీ మంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయడం అన్యాయమని డోన్‌ మండల టీడీపీ అధ్యక్షుడు వెంగనాయునిపల్లి శ్రీను, ఆంజనేయగౌడు, కమలాపురం మధుసూదన్‌బాబు అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కళా వెంకట్రావు అరెస్టుని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంగనాయునిపల్లి శ్రీనివాసులు యాదవ్‌ మాట్లాడుతూ నిజాయితీతో ప్రజా జీవితంలో ఉన్న కళా వెంకట్రావుపై అక్రమ కేసులు బనాయించి రాత్రివేళ వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోసానిపల్లి మల్లయ్య, మిద్దెపల్లె గోవిందు, చిట్యాల రఘు, గుండాల నారాయణస్వామి, మాధవరాజ్‌ పాల్గొన్నారు.


పత్తికొండ: టీడీపీ సీనియర్‌ నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అరెస్టుకు నిరసనగా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో గురువారం నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం నేపథ్యంలో చంద్రబాబునాయుడు పరిశీలనకు వెళ్లారని, అదే సమయంలో అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్లడంతో ఆగ్రహంతో ఉన్న భక్తులు రాళ్లు, చెప్పులతో దాడులకు దిగారన్నారు. అయితే ఈ సంఘటనకు కళా వెంకట్రావు బాధ్యుడిగా చేసి అతడితో పాటు మరో 15మందిపై అక్రమ కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణమైన విషయమన్నారు.  


  వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారు : పంచాయతీ ఎన్నికలలో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేఈ శ్యాంబాబు అ న్నారు. గురువారం  టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ  ప్రజాస్వామ్య విలువలను విస్మరించి వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉన్నారు. 


ఎమ్మిగనూరు: అక్రమ అరెస్టులతో టీడీపీ నాయకులను అణచివేయలేని మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ కొండయ్యచౌదరి, నాయకులు శివశంకర్‌, రాందాస్‌ గౌడ్‌, సుందర రాజు, కటారి రాజేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళావెంకట్రారావు అరెస్టుకు నిరసనగా గురువారం సోమప్ప సర్కిల్‌లో పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు నిరసన తెలి పారు. ప్రజావ్యతిరేక పాలనను ఎత్తి చూపుతున్న  ప్రతిపక్ష టీడీపీ నాయకలను అరెస్టుచేసి అణచి వేయాలని చూస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకు ఆలయాలపై దాడులు పెరిగి పోతున్నాయని, అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజావ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారని, తగిన సమయంలో బుద్ధి చెబుతా రన్నారు. రంగస్వామిగౌడ్‌, మల్లి, దాదా, దామ నరసింహులు, సలీం, అల్తాఫ్‌, బచ్చాల రంగన్న, శ్రీనివాసులు, రాముగౌడ్‌, బిజ్జే నాగరాజు, తేజ, అంజి, రామకృష్ణ, అబ్దుల్‌, ఈరన్న, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చంద్రన్న, రమేష్‌, రంగన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-22T05:59:53+05:30 IST