Passion పోయిందంటూ Congressకు రాజీనామా చేసిన Kalappa

ABN , First Publish Date - 2022-06-01T19:42:00+05:30 IST

Passion పోయిందంటూ Congressకు రాజీనామా చేసిన Kalappa..

Passion పోయిందంటూ Congressకు రాజీనామా చేసిన Kalappa

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మరొక ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో చాలా కాలంగా ఉన్న నేత బ్రిజేష్ కలప్ప రాజీనామా చేశారు. ఆయన తొందరలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాన్ని పార్టీ అధినేత సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన వెల్లడించారు. పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యం లేదని, అలాంటి చోట పని చేసేందుకు తాను ఉత్సాహంగా లేనని అందుకే రాజీనామా చేసినట్లు కలప్ప తెలిపారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ అయిన కలప్ప 1997లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


‘‘నేను 2013 నుంచి అంటే దశాబ్ద కాలంగా మీడియాలో కాంగ్రెస్ పార్టీ గొంతుకను వినిపిస్తున్నాను. హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కలిపి మొత్తంగా 6497 డిబేట్లలో పాల్గొని ఉంటాను. పార్టీ నాకు రోజూ ఏదో ఒక పని అప్పగించేది. నా సంతృప్తి మేరకు ఉన్నతంగా పని చేశాను. నాకెప్పుడూ పని ఇబ్బందిగా అనిపించలేదు, భారంగా తోచలేదు. అత్యంత ఉత్సాహంతో పని చేశాను. కానీ కొంత కాలంగా నా అభిరుచి లోపించినట్లు గమనించాను. నా స్వతంత్ర పనితీరు పార్టీకి పనికిరానిదిగా కనిపించింది. బహుశా దానివల్లే నేను పార్టీ పని పట్ల ఉత్సాహం చూపించలేకపోతున్నాను’’ అని సోనియాకు రాసిన లేఖలో కలప్ప పేర్కొన్నారు.

Updated Date - 2022-06-01T19:42:00+05:30 IST