Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదన్న కేంద్రం

ABN , First Publish Date - 2022-07-21T23:13:51+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)కు జాతీయ హోదా అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం (Central government) తేల్చిచెప్పింది.

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదన్న కేంద్రం

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)కు జాతీయ హోదా అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం (Central government) తేల్చిచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడులకు అనుమతులు లేవని ప్రకటించింది. జాతీయ హోదా ప్రాజెక్టు పథకంలో ఏ ప్రాజెక్టునైనా చేర్చాలంటే  CWC అధ్యయనం తప్పనిసరి కేంద్రం చెబుతోంది. ఆ తర్వాత ప్రాజెక్ట్‌ సలహా కమిటీ ఆమోదం పొందాలని పేర్కొంది. పెట్టుబడుల అనుమతి కేంద్రం నుంచి తీసుకోవాలని తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోలేదని కేంద్రం అంటోంది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) ప్రశ్నకు.. కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ లిఖితపూర్వక సమాధానిచ్చారు. 2016, 2018లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ (CM KCR) కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరరానికి జాతీయ హోదా లభిస్తే.. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. 

Updated Date - 2022-07-21T23:13:51+05:30 IST