కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు: మాజీ ఎంపీ వివేక్‌

ABN , First Publish Date - 2022-08-15T03:39:33+05:30 IST

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారని మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ పేర్కొన్నారు. ఆదివారం వేలాలలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం లేదన్నారు. మూడేళ్ళుగా కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో పంటలు నీట మునుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదన్నారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు: మాజీ ఎంపీ వివేక్‌
బెల్లంపల్లిలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి, నాయకులు

జైపూర్‌, ఆగస్టు 14 : కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారని మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ పేర్కొన్నారు. ఆదివారం వేలాలలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం లేదన్నారు. మూడేళ్ళుగా కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో పంటలు నీట మునుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదన్నారు. వేలాలలో బ్యాక్‌ వాటర్‌తో నష్టపోయిన మత్స్య కార్మికులకు పనిముట్లను అందజేశారు.  నాయకులు అందుగుల శ్రీనివాస్‌, పార్టీ మండల అధ్యక్షుడు విశ్వంభర్‌రెడ్డి, డేగ నగేష్‌  పాల్గొన్నారు.  అనంతరం వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికా ర్డును సాధించిన వెన్నంపల్లి వేదాంత్‌సాయి, సిద్దాంత్‌సాయి లను  వేలాల పంచాయతీ కార్యాలయంలో అభినందించారు. 

ఏసీసీ : కమీషన్ల కోసమే ముందు చూపు లేకుండా కాళే శ్వరం ప్రాజెక్టు నిర్మించి వరదల వల్ల వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి సీఎం కేసీఆర్‌ కారకుడయ్యాడని వివేక్‌ వెంకటస్వామి అన్నారు.  ఎన్‌టీఆర్‌ నగర్‌లో వరదల వల్ల ఇండ్లు కూలిన కుటుంబాలకు సిమెంట్‌ బ్యాగులు, రేకులు, ఇటుకలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌తో కలిసి అందజేశారు. వరదలు వచ్చి నెల రోజులు గడిచినా సీఎం బాధిత కుటుంబాలను ఆదుకోలేదని విమర్శించారు.   రంగారావు, రాజు, కృష్ణ, రాకేష్‌, సతీష్‌,  పాల్గొన్నారు.  

బెల్లంపల్లి: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.  ఆదివారం  రైల్వే స్టేషన్‌ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘు నాధ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు రమేష్‌, అందుగుల శ్రీనివాస్‌, పట్టణాధ్యక్షులు  కోడి రమేష్‌, సంతోష్‌ పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  దీక్ష చేస్తున్న వీఆర్‌ఏలకు మద్దతు తెలిపారు.  

Updated Date - 2022-08-15T03:39:33+05:30 IST