Kaleswaram: వల్లే గోదావరికి ముంపు పెరిగింది: డీకే అరుణ

ABN , First Publish Date - 2022-07-22T22:49:15+05:30 IST

కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్లే గోదావరి(Godavari)కి ముంపు పెరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK ARUNA) అన్నారు.

Kaleswaram:  వల్లే  గోదావరికి ముంపు  పెరిగింది: డీకే అరుణ

మంచిర్యాల: కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్లే గోదావరి(Godavari)కి ముంపు పెరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK ARUNA) అన్నారు. శుక్రవారం అరుణ మంచిర్యాలలో పర్యటించారు. ఈసందర్భంగా అరుణ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముంపు ప్రాజెక్టుగా మారిందన్నారు. వేల ఎకరాల్లో పంటలు, పల్లెలు మునగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ (TRS GOVT) అనాలోచిత విధానాలే కారణమని మండిపడ్డారు.ఇతర రాష్ట్రాల్లో రైతులకు సహాయం అందించే సీఎం కేసీఆర్‌(CM KCR)కు ఇక్కడి ప్రజల కన్నీళ్లు మాత్రం కనిపించడం లేదన్నారు. సొంత రాష్ట్ర రైతులకు కన్నీళ్లను మిగిల్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం ప్రజల్లో నెలకొందన్నారు.నూతనంగా నిర్మించిన మాత శిశు ఆస్పత్రి వరద ముంపునకు గురవడం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తక్షణమే వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-22T22:49:15+05:30 IST