ఆర్‌బీకేల్లో కల్తీ వేపనూనె అమ్మకాలు

ABN , First Publish Date - 2021-11-28T05:43:45+05:30 IST

రైతు భరోసా కేంద్రంలో కల్తీ వేపనూనె విక్రయాల గుట్టురట్టయింది. పాత గుంటూరు, ఆటోనగర్‌లో కల్తీవేపనూనె తయారు చేసి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఆర్‌బీకెలలో అమ్ముతున్నట్లు జేఈ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదుల అందగా.. ఆయన ఆదేశాలతో శనివారం దాడులు నిర్వహించారు.

ఆర్‌బీకేల్లో కల్తీ వేపనూనె అమ్మకాలు
కల్తీవేపనూనె సీసాలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

నడింపాలెంలో ఓ ఉద్యోగి తొలగింపు

ఎంఏవో, 8 మంది ఆర్‌బీకే సిబ్బంది సస్పెన్షన

గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రంలో కల్తీ వేపనూనె విక్రయాల గుట్టురట్టయింది. పాత గుంటూరు, ఆటోనగర్‌లో కల్తీవేపనూనె తయారు చేసి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఆర్‌బీకెలలో అమ్ముతున్నట్లు జేఈ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదుల అందగా.. ఆయన ఆదేశాలతో శనివారం దాడులు నిర్వహించారు. పాతగుంటూరు, ఆటోనగర్‌లలో కల్తీవేపనూనె తయారీ కేంద్రాలపై గుంటూరు ఏడీ శ్రీనివాసరావు, ఏవో ప్రియదర్శినిలు దాడులు చేశారు. కల్తీ వేపనూనె తయారుచేస్తున్న పాతగుంటూరు వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ వ్యవహారంలో నడింపల్లి ఆర్‌బీకేలో పనిచేస్తున్న షేక్‌ షాహిద్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఎనిమిది మంది ఆర్‌బీకే ఉద్యోగులు, పత్తిపాడు ఎంఏవో సీహెచ విజయరాజును సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు కల్తీ వేసనూనె అమ్మకాలపై పాతగుంటూరు, పత్తిపాడు పోలీస్‌స్టేషనలలో కేసులు నమోదుచేశారు. ఈ వ్యవహారంలో ఒక మండల ప్రజాప్రతినిధి ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  

  

Updated Date - 2021-11-28T05:43:45+05:30 IST