వైభవంగా కాల్వ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-05-17T06:54:57+05:30 IST

భక్తుల ఇలవేల్పు కాల్వలక్ష్మీ నరసింహస్వామి కల్యా ణోత్సవం సోమవారం అంగరంగా వైభవంగా జరిగింది.

వైభవంగా కాల్వ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
స్వామివారి కల్యాణ మహోత్సవంలో తాళిబొట్టు చూపుతున్న అర్చకులు

భక్తజన సంద్రమైన కాల్వ అడవులు 

పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి అల్లోల

దిలావర్‌పూర్‌, మే 16 : భక్తుల ఇలవేల్పు కాల్వలక్ష్మీ నరసింహస్వామి కల్యా ణోత్సవం సోమవారం అంగరంగా వైభవంగా జరిగింది. నరసింహస్వామి కల్యాణోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివ చ్చారు. భక్తులతో కాల్వ అడవులు జనసంద్రమయ్యాయి. స్వామివారి అష్టము ఖి కోనేరులో భక్తలు పవిత్రస్నానాలు ఆచరించారు. కల్యాణోత్సవంలో భాగంగా నిర్వహించే ఎదుర్కోలు కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. స్వామి వారు అలకబూనటం అమ్మవారి తరుపు వారు స్వామివారిని బతిమిలాడి కల్యాణ మండపానికి తీసుకువచ్చే తంతు భక్తులను ఆకర్షించింది. పండి తులు వేదమంత్రాలు పటిస్తుండగా వేలాది మంది భక్తుల సమక్షంలో నరసింహస్వామివారు అమ్మవారికి మంగళ సూత్రధారణ చేసే ఘట్టం భక్తు లను భక్తి పారవశ్యంలో ముంచింది. అనంతరం భక్తులు స్వామివారి పాదాల చెంత తలంబ్రాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కట్న కానుక లు సమర్పించుకున్నారు. 

పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి అల్లోల

సోమవారం జరిగిన కాల్వ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కె.విజయలక్ష్మితో కలిసి స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పిం చారు. కల్యాణోత్సవం పూర్తయ్యే వరకు మంత్రి అల్లోలకల్యాణ మం డపం లోనే ఉన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు మంత్రి అల్లోల కు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలి కారు. దేవస్థానం చైర్మన్‌ నిమ్మల చిన్నయ్య మంత్రి అల్లోలను శాలువాతో సత్క రించి స్వామివారి ప్రసాదం అందజేశారు. 

స్వామిని దర్శించుకున్న ఏలేటి

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సోమవారం కాల్వ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యే కపూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభిం చారు. దిలావర్‌పూర్‌ జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి దంపతులు బ్రహ్మోత్స వాలకు హాజరై భక్తులకు అన్నదానం చేశారు. కాగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని మంత్రి అల్లోల రాకకు ముందే వెళ్లిపోయారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.ముత్యంరెడ్డి, జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, సత్యం చంద్రకాంత్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T06:54:57+05:30 IST