కరోనా ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలి: కాలవ శ్రీనివాసులు

ABN , First Publish Date - 2021-06-21T20:33:51+05:30 IST

కరోనా విపత్కర సమయంలో ఇతర రాష్ట్రాలు ప్రకటించినట్లుగా కరోనా ప్యాకేజీని వైసీపీ ప్రభుత్వం ప్రకటించాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

కరోనా ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలి: కాలవ శ్రీనివాసులు

అమరావతి: కరోనా విపత్కర సమయంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినట్లుగా  వైసీపీ ప్రభుత్వం  కూడా ఏపీలో కరోనా ప్యాకేజీని ప్రకటించాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా నియంత్రణలో అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఆర్భాటపు ప్రచారం చేస్తోందన్నారు.  వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒకే రోజు 13 లక్షలు వ్యాక్సిన్లు వేశామని సీఎం జగన్ రెడ్డి గొప్పలు చెబుతున్నారన్నారు. ప్రజలను వారం రోజుల పస్తులు పెట్టి ఒక రోజు చికెన్ పెట్టినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ మోసకారి చర్యలున్నాయన్నారు. వేల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తే పదుల సంఖ్యలో చనిపోయినట్లు ప్రభుత్వం  అధికారికంగా ప్రకటన చేస్తుందని కాలవ శ్రీనివాసులు చెప్పారు. 

Updated Date - 2021-06-21T20:33:51+05:30 IST