రాయలసీమకు తీరని అన్యాయం: కాలవ శ్రీనివాసులు

ABN , First Publish Date - 2021-04-12T20:11:01+05:30 IST

కర్ణాటక ప్రభుత్వం భారీగా ఆలమట్టి నీటిని వాడుతుండటంతో.. ఏపీలోని శ్రీశైలానికి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందని...

రాయలసీమకు తీరని అన్యాయం: కాలవ శ్రీనివాసులు

అనంతపురం: కర్ణాటక  ప్రభుత్వం భారీగా ఆలమట్టి నీటిని వాడుతుండటంతో.. ఏపీలోని  శ్రీశైలానికి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం తీసుకున్న చర్యల గురించి.. సీఎం జగన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  అఖిలపక్షం ఏర్పాటు చేసి సీమ ప్రాజెక్టులపై రోడ్‌మ్యాప్‌ ప్రకటించాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిలోకి తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను తేవడంతో.. రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని కాలవ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-12T20:11:01+05:30 IST