‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం

ABN , First Publish Date - 2022-08-16T06:57:39+05:30 IST

కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు.

‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర

 ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ 

దేవరకొండ, ఆగస్టు 15: కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గంలోని 221 మందికి మంజూరైన చెక్కు లు, చీరలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన ఆ లంపల్లి నర్సింహ, ఎంపీపీ జానయాదవ్‌, జడ్పీటీసీ అరుణసురే్‌షగౌ డ్‌, ప్రవీణవెంకట్‌రెడ్డి, నాయకులు జంగారెడ్డి, సుభాష్‌, కృష్ణయ్య, ప్రవీణ్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, రాజవర్ధనరెడ్డి పాల్గొన్నారు. 

అభివృద్ధి పథకాలు చూసి పార్టీలో చేరికలు  

కొండమల్లేపల్లి: సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి పథకాల ను చూసి యువకులు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. కొండమల్లేపల్లి మండ లానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ చేరారు. వారికి మార్కెట్‌ ఆవరణలో ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దస్రునాయక్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ చైర్మన కేసాని లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివా్‌సయాదవ్‌, సర్పంచ శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు. 

క్రీడలతో మానసిక ఉల్లాసం  

చింతపల్లి: క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో ఎంసీసీ క్రికెట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రవీణవెంకట్‌రెడ్డి, నాయకులు గిరిధ ర్‌, అశోక్‌, విద్యాసాగర్‌రావు, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:57:39+05:30 IST