‘కల్యాణలక్ష్మి’ పేదింటి ఆడబిడ్డలకు భరోసా

ABN , First Publish Date - 2022-05-24T06:59:12+05:30 IST

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ తెలిపారు.

‘కల్యాణలక్ష్మి’ పేదింటి ఆడబిడ్డలకు భరోసా
కొమరబండలో గొర్రె అందజేస్తున్న ఎమ్మెల్యే బొల్లం, బాలరాజు

కోదాడ రూరల్‌/ కోదాడ టౌన్‌, మే 23: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ తెలిపారు. పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో తిరిగి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా కొమరబండ గ్రామంలో రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా షిప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌తో కలిసి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, వైస్‌చైర్మన్‌ వెంపటి పద్మామధుసూదన్‌, ఉపేందర్‌గౌడ్‌, చందు నాగే శ్వరరావు, అనంత సైదయ్య, కౌన్సిలర్లు చందర్‌రావు, షబ్బీర్‌, పద్మజ, హనుమంతురావు, శివ, సుబ్బారావు, చందు నాగేశ్వరరావు, వనపర్తి లక్ష్మీనారాయణ, మధుసుదన్‌, మాధవి, రంగారావు, మామిడి పద్మా వతి, రామారావు, రామయ్య తదితరులు పాల్గొన్నారు. 


దళిత మహిళ ఇంట్లో ఎమ్మెల్యే భోజనం

 కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ చెక్కులు పంపిణీ చేసేందుకు కొమరబండ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ ఇంటింటికి తిరుగుతూ చెక్కులు పంపిణీ చేసే క్రమంలో దేవపంగు ఇందుశ్రీ అనే దళిత మహిళకు చెక్కు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. ఆ మహిళ తన ఇంట్లో భోజనం చేయాలని ఎమ్మెల్యేను కోరింది. ఇందుకు  ఆయన అంగీకరించడంతో స్వయంగా అన్నం కలిపి ఎమ్మెల్యేకు తినిపించింది. 

Updated Date - 2022-05-24T06:59:12+05:30 IST