కళ్యాణదుర్గం ఓటర్లు 2,21,714

ABN , First Publish Date - 2021-01-17T05:57:20+05:30 IST

కళ్యాణదుర్గం నియోజకవర్గ తుది ఓటర్ల జాబితాను ఆర్డీఓ రామ్మోహన శనివారం విడుదల చేశారు. మొత్తం ఓట ర్లు 2,21,714 మంది జాబితాలో నమోదయ్యారు

కళ్యాణదుర్గం ఓటర్లు 2,21,714

కళ్యాణదుర్గం, జనవరి 16: కళ్యాణదుర్గం నియోజకవర్గ తుది ఓటర్ల జాబితాను ఆర్డీఓ రామ్మోహన శనివారం విడుదల చేశారు. మొత్తం ఓట ర్లు 2,21,714 మంది జాబితాలో నమోదయ్యారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శనివారం మండలాల వారిగా ఓటర్ల ముసాయిదాను సిబ్బందికి అందజేశారు. తుది ఓటర్ల జాబితాలు నియోజకవర్గ, మండల, బూత లెవె ల్‌ అధికారులతో అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు తమ ఓటును జాబితాలో పరిశీలించుకోవచ్చన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6, తొ లగింపునకు ఫారం-7, సవరణకు ఫారం-8, నియోజకవర్గం పోలింగ్‌ స్టేషన మార్పునకు ఫారం-8ఏల ద్వారా ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో ఎలెక్షన డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 


రాయదుర్గంలో 2,55,379 మంది ఓటర్లతో తుది జాబితా 

రాయదుర్గం : నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను శనివారం తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం విడుదల చేశారు. నియోజకవర్గంలో 2,55,379 మం ది ఓటర్లు ఉన్నట్లు తుది జాబితాలో పేర్కొన్నారు. వీరిలో పురుషులు 1,27,484 మంది కాగా, మహిళలు 1,27,879 మంది, 16 మంది ఇతర ఓ టర్లు ఉన్నారు. అదేవిధంగా రాయదుర్గం మండలంలో 37 పోలింగ్‌ కేం ద్రాల్లో 33,361 మంది ఓటర్లు వుండగా, అందులో పురుషులు 16,767, మహిళలు 16,591, ఇతరులు ముగ్గురు వున్నారు. రాయదుర్గం మున్సిపాలి టీ పరిధిలో 48 పోలింగ్‌ కేంద్రాల్లో  51,048 మంది ఓటర్లు వుండగా, పురుషులు 24,824 మంది, మహిళలు 26,220 మంది, ఇతరులు నలుగురు వు న్నారు.


డీ హీరేహాళ్‌ మండలంలో 43 పోలింగ్‌ కేంద్రాల్లో 35,388 మంది ఓ టర్లు వుండగా పురుషులు 17,813 మంది, మహిళలు 17,573 మంది, ఇతరులు ఇద్దరు వున్నారు. బొమ్మనహాళ్‌ మండలంలో 57 పోలింగ్‌ కేంద్రాల్లో 45,652 మంది ఓటర్లు వుండగా పురుషులు 22,913, మహిళలు 22,736, ఇతరులు ముగ్గురు వున్నారు. కణేకల్లు మండలంలో 63 పోలింగ్‌ కేంద్రాల్లో 51,668 మంది ఓటర్లు వుండగా పురుషులు 25,681, మహిళలు 25,984 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. గుమ్మఘట్ట మండలంలో 45 పోలిం గ్‌ కేంద్రాల్లో 38,262 మంది ఓటర్లుండగా పురుషులు 19,486, మహిళలు 18,775, ఇతరులు ఒకరున్నారు.

Updated Date - 2021-01-17T05:57:20+05:30 IST