‘ఇండియన్‌ 2’ పంచాయితీకి దూరంగా కమల్‌

Jun 1 2021 @ 21:48PM

విశ్వనటుడు కమల్‌ హాసన్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా.. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌-2’. ఈ చిత్రం చిత్రీకరణను చాలావరకు పూర్తి చేశారు. అయితే, పలు అవాంతరాల కారణంగా షూటింగ్‌ పూర్తి చేయలేకపోయారు. ఈ తీవ్ర జాప్యం కారణంగా దర్శకుడు శంకర్‌ ఇతర ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ, ‘ఇండియన్‌-2’ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ శంకర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కింది. ఆ తర్వాత కోర్టు సూచన మేరకు ఇరు వర్గాలు సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిపారు. కానీ, అవి ఫలించలేదు. ఫలితంగా ఈ పంచాయితీ ప్రస్తుతం కోర్టు బోనులో ఉంది. 


ఇదిలావుంటే, ఈ సమస్య పరిష్కారం కోసం హీరో కమల్‌ హాసన్‌ చొరవ చూపిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, సమస్య కోర్టులో ఉండటంతో ఇప్పుడు తలదూర్చరాదన్న తలంపులో కమల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో ఒక వేళ ‘ఇండియన్‌-2’ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేయాలని దర్శకుడు శంకర్‌ను ఆదేశిస్తే మాత్రం.. ‘ఇండియన్‌-2’ సినిమా షూటింగులో పాల్గొనాలని కమల్‌ హాసన్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అలాకాని పక్షంలో లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కే ‘విక్రమ్‌’ షూటింగులో పాల్గొనేలా కమల్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.