కమల్‌హాసన్‌ మార్పులు చేస్తారట!

Jun 8 2021 @ 19:47PM

మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘దృశ్యం’ తమిళంలో ‘పాపనాశం’ టైటిల్‌తో రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే! ఇప్పుడు దానికి కొనసాగింపు కూడా చేయాలని కమల్‌హాసన్‌ భావిస్తున్నారు. అందుకు దర్శకుడు జీతూ జోసెఫ్‌ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే కమల్‌ ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారట. తన లివింగ్‌ పార్టనర్‌గా ఉన్న గౌతమి ‘పాపనాశం’లో కమల్‌కు జోడీగా నటించారు. అయితే ఈ ఆరేళ్లలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ విడిపోయారు. ఆ కారణంతోనే తాజా చిత్రంలో కమల్‌ కథానాయికను మార్చాలనుకుంటున్నారని తమిళ పరిశ్రమ నుంచి సమాచారం. గౌతమి స్థానంలో మీనాను గానీ, మరో నాయికను గానీ తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఇందుకు దర్శకుడు అంగీకరిస్తారా లేదా అన్నది తెలియాలి. ఇటీవల మలయాళంలో విడుదలైన ‘దృశ్యం 2’ సక్సెస్‌ అయింది. తెలుగులో కూడా ‘దృశ్యం 2’ చిత్రీకరణ 45 రోజుల్లో పూర్తయింది. మరి కమల్‌ ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి! 




Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.