Vikram: ‘మత్తుగ మత్తుగ’ అంటోన్న కమల్ హాసన్

Published: Fri, 27 May 2022 19:01:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Vikram: మత్తుగ మత్తుగ అంటోన్న కమల్ హాసన్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). స్టార్ యాక్టర్స్  విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై భారీగా అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ ‘మత్తుగ మత్తుగ’ (Mathuga Mathuga) పాట లిరికల్ వీడియోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ పాటని మాస్, గ్రూవీ సాంగ్‌గా డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్‌తో.. డ్యాన్సింగ్ నెంబర్‌గా కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్‌లో ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేలా ఉంది. ఈ పాటలో కమల్ హాసన్ డ్యాన్స్ మూవ్స్ కూడా అదుర్స్ అనేలా వున్నాయి. ముఖ్యంగా తలపై షర్టు కప్పుకొని కమల్ హాసన్ చేసిన మాస్ డ్యాన్స్ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ పాటకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే..  కమల్ హాసన్ ఈ పాటని స్వయంగా పాడటం. ఈ పాటకు చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌ (R Mahendran)తో కలిసి కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) గెస్ట్ పాత్రలో కనిపించనున్నారు. కాగా, స్టార్ హీరో నితిన్‌ (Nithiin) హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్(Sreshth Movies) ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International