బైడెన్‌పై కమల హారిస్ ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2020-11-29T10:50:26+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌పై ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ అత్యుత్తమ అధ్యక్షుడిగా ప్రపంచం గర్వించే నాయ

బైడెన్‌పై కమల హారిస్ ప్రశంసల వర్షం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌పై ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ అత్యుత్తమ అధ్యక్షుడిగా ప్రపంచం గర్వించే నాయకుడిగా ఉంటారని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. ‘జో బైడెన్ అమెరికా అత్యుత్తమ అధ్యక్షుడిగా ఉంటారు. ప్రపంచం ఆయనను గౌరవిస్తుంది. భవిష్యత్తు తరాలవారు దాన్ని చూస్తారు’ అంటూ కమలా హారిస్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. కరోనాను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని బైడెన్ ట్వీట్ చేశారు. తీసుకునే ప్రతి నిర్ణయం ఓ జీవితాన్ని కాపాడుతుందన్నారు. కాగా.. డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. 306 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకుని అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-11-29T10:50:26+05:30 IST