Kamalhasanకు మెట్రో రైల్‌ నోటీసు?

ABN , First Publish Date - 2022-07-03T15:31:46+05:30 IST

సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌కు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) నోటీసు పంపించింది. మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిర్మాణం

Kamalhasanకు మెట్రో రైల్‌ నోటీసు?

అడయార్‌(చెన్నై), జూన్‌ 2: సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌కు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) నోటీసు పంపించింది. మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం కావాల్సిన స్థల సేకరణలో సీఎంఆర్‌ఎల్‌ దృష్టిసారించింది. ఇందులోభాగంగా స్థానిక ఆళ్వార్‌పేటలోని టీటీకే శాలైలో ఉన్న కమల్‌ హాసన్‌కు సొంతమైన చోటులో 8 నుంచి 10 అడుగుల స్థలం కావాల్సి వచ్చింది. ఈ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ కమల్‌కు నోటీసు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ కార్యాలయం ఉంది. ఈ నేపథ్యంలో స్థల సేకరణ చర్యల్లో భాగంగా ఈ నోటీసులు పంపించింది. కాగా, నగరంలో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టులో భాగంగా లైట్‌హౌస్‌ నుంచి పూందమల్లి వరకు మెట్రో మార్గాన్ని కొంత భూగర్భంలోనూ, మరికొంత పిల్లర్లపై నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 

Updated Date - 2022-07-03T15:31:46+05:30 IST