
చెన్నై: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన మక్కల్ నీదిమయ్యం పార్టీని బలపరి చేందుకు చర్యలు చేపడుతోంది. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కన్నియాకుమారి నుంచి చెన్నై వరకు కమల్ పర్యటించనున్నారని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. ఈ పర్యటనలో పలు నగరాల్లో రోడ్‌షోలు, గ్రామసభల్లో ఆయన ప్రసంగిస్తారన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టడంతో కమల్ పర్యటనకు పోలీసులు అనుమతించే అవకాశం కూడా ఉందన్నారు. కమల్ తన పర్యటనలో ఎప్పటిలాగే ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టిసారిస్తారని, త్వరలో పర్యటన వివరాలపై అధికారిక ప్రకటన జారీ అవుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి