కమనీయం... సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2021-04-22T04:59:04+05:30 IST

భారతీయుల ఆరాధ్యదైవం సీతారాముల కల్యాణం బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు.

కమనీయం... సీతారాముల కల్యాణం
టంగుటూరు కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 21: భారతీయుల ఆరాధ్యదైవం సీతారాముల కల్యాణం బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. బంగారు అంగళ్ల వీధిలోని ఆత్మారామస్వామి ఆలయం, శివాలయంలోని అభయ వరద రామచంద్రస్వామి ఆలయం, కోనేటి కాల్వ వీధి, దేవాంగపేట, వెంకటేశ్వర్లపేట, సుబ్బిరెడ్డికొట్టాలులోని రామాలయాల్లో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. బంగారు అంగళ్లవీధిలోని ఆత్మారామస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. వేద పండితులు శుభముహూర్తంలో స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవాంగపేటలోని కోదండరామస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణంు పురష్కరించుకుని దేవాంగసంఘం అధ్యక్షుడు ఉట్టి నాగశయనం స్వామివారి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.


జమ్మలమడుగులో...

జమ్మలమడుగు రూరల్‌, ఏప్రిల్‌ 21: జమ్మలమడుగు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం శ్రీరామ నవమి వేడుకలను వైభవంగా జరుపుకు న్నారు. పట్టణంలోని పాత బస్టాండు సమీపాన పార్కు వీధిలో వెలసిన ఆలయంలో సీతారాముల కల్యాణం జరిగింది. అలాగే నగర పంచాయతీ పరిధిలోని కన్నెలూరు, మోరగుడి, ఎస్‌.ఉప్పలపాడు, దేవగుడి, పెద్దదండ్లూరు, గండికోట, తదితర గ్రామాల్లో శ్రీరాముని ఆలయాల వద్ద, ఆంజనేయస్వామి ఆలయాల వద్ద భక్తులు శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించారు. భక్తులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయాల వద్దకు మాస్కులు ధరించి వచ్చారు.  


ఎర్రగుంట్లలో...

ఎర్రగుంట్ల, ఏప్రిల్‌ 21: నడివూరులోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొవిడ్‌ నిబంధనలను పాటి స్తూ తక్కువ మందితో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్‌ సానేపల్లి లక్ష్మిఈశ్వరీ, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే శ్రీరామాలపేటలోని రామాలయంలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా జరిపించారు. కల్యా ణోత్సవంలో కౌన్సిలర్‌ ఎర్రంరెడ్డి లావణ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  


మైలవరంలో.....

మైలవరం, ఏప్రిల్‌ 21: మండల పరిధిలోని వేపరాల కొత్తకొట్టాలలోని రామాలయంలో బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని  శ్రీకోదండ సీతారామస్వాముల కల్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ బొజ్జొల కొండయ్య, గ్రామ పెద్దల ఆద్వర్యంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో ముందుగా శాంతియజ్ఞం జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నదానం చేశారు.


కొండాపురంలో....

 

కొండాపురం, ఏప్రిల్‌ 21: మండలంలో శ్రీరామనవమి పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు రామాలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుగుమంచిపల్లె, ఓబన్న పేట ఆంజనేయస్వామి విగ్రహాలతో పాటు పలు రామాల యాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా ఆలయాల్లో సందడి తగ్గింది. 


రాజుపాళెంలో...

రాజుపాళెం, ఏప్రిల్‌ 21: మండల పరిధిలోని టంగుటూరు గ్రామంలోని శ్రీకోదండరామస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమిని పురష్కరించుకుని బుధవారం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కాచిన వెంకటసుబ్బారెడ్డి, సుభా్‌షరెడ్డి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కల్యాణాన్ని వేద పండితులు చక్రపాణి, ప్రదీ్‌పల మంత్రోచ్ఛారణలతో నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే తొండలదిన్నె, గాదెగూడూరు తదితర గ్రామాల్లో ఈ శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

Updated Date - 2021-04-22T04:59:04+05:30 IST