కమనీయం వీరభద్రస్వామి కల్యాణం

Published: Sun, 27 Mar 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కమనీయం వీరభద్రస్వామి కల్యాణంస్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, భక్తులు

భక్తజన సంద్రంగా బొంతపల్లి వీరన్నగూడెం 

స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన ఎమ్మెల్యే  

నేడు స్వామివారి రథోత్సవం


గుమ్మడిదల, మార్చి 27: సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా నిలిచిన బొంతపల్లి వీరన్నగూడెం లోని వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగాయి. ఆదివారం స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో భద్రకాళీ సహిత వీరభద్రస్వామికి ఎదుర్కోళ్లు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ భద్రప్ప, ఈవో శశిధర్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అంగరంగ వైభవంగా కల్యాణం జరిపారు. పలువురు దంపతులు పెళ్లి పెద్దలుగా కూర్చుని కల్యాణం జరిపించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంపీపీ సద్ది ప్రవీణా విజయభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, సర్పంచులు ఆలేటి నవీన శ్రీనివా్‌స్‌ రెడ్డి, మమత వేణు, ఎంపీటీసీ నాగేందర్‌గౌడ్‌, స్థాని క బీజేపీ నాయకులు గిద్దె రాజు, దేవాలయ కమిటీ సభ్యులు దేవేందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు హుస్సేన్‌, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, సర్పంచులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం  అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఘనంగా అగ్ని గుండాలు

వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామి వారి అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి వీరభద్రస్వామి ఆలయంలో నిత్య పూజలతో పాటు స్వామివారికి వాహన సేవలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో అగ్నిగుండం ఏర్పాటు చేశారు. ముందుగా రాత్రి అగ్నిగుండంలో వేదమంత్రాల మధ్య కట్టెలను సమకూర్చి అగ్ని వెలిగించారు. ఆదివారం తెల్లవారుజామున భక్తులు నడిచి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ భద్రప్ప, ఈవో శశిధర్‌ తెలిపారు. 

ఆలయానికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి రూ.20లక్షల విరాళం

  భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.20లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌ భద్రప్పకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అందజేశారు. స్వామి వారి కల్యాణ మహోత్సవంలో కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాభివృద్ధికి ఎల్లవేళలా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్థులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.