కామారెడ్డి జిల్లా: బిక్కనూరులో దారుణం

ABN , First Publish Date - 2022-03-01T18:08:09+05:30 IST

కామారెడ్డి జిల్లా: బిక్కనూరు మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది.

కామారెడ్డి జిల్లా: బిక్కనూరులో దారుణం

కామారెడ్డి జిల్లా: బిక్కనూరు మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. పెద్దమల్లారెడ్డిలో ఓ ఉపాధ్యాయురాలి డ్రైవర్ పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలు కామారెడ్డి జిల్లా, పెద్దమల్లారెడ్డి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. కారులో వచ్చేందుకు వీలుగా కిషన్ అనే వ్యక్తిని డ్రైవర్‌గా నియమించుకున్నారు. ఎప్పటిలాగే సోమవారం టీచర్‌ను పాఠశాలలో దించిన డ్రైవర్.. అదే స్కూల్‌కు చెందిన విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు జరిగిన విషయాన్ని హెడ్‌మాస్టర్, కుటుంబసభ్యులకు చెప్పారు.


దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు డ్రైవర్ కిషన్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌తోపాటు ఉపాధ్యాయురాలిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-03-01T18:08:09+05:30 IST