Monkeypox: కామారెడ్డిలో కలకలం.. వ్యక్తికి సోకినట్లు అనుమానం!

ABN , First Publish Date - 2022-07-25T00:34:20+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ (Monkey Pox) భారత్‌ (Bharat)కు కూడా పాకింది. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ...

Monkeypox: కామారెడ్డిలో కలకలం.. వ్యక్తికి సోకినట్లు అనుమానం!

కామారెడ్డి (Kamareddy): ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ (Monkey Pox) భారత్‌ (Bharat)కు కూడా పాకింది. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ ఢిల్లీ (Delhi)లో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లాలో మంకీ పాక్స్ కలకలం రేగింది.  ఇంద్రానగర్ కాలనీలో ఓ వ్యక్తికి మంకీ ఫాక్స్ సోకినట్లు అనుమానం వ్యక్తమైంది. దాంతో ఆయనను వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్‌లో ఉంచారు. మంకీ ఫాక్స్‌గా అనుమానించి బాధితుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ (Hyderabad) తరలించారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో వ్యక్తి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు.  


మంకీపాక్స్ అనేది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరల్‌ వ్యాధి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి జంతువుల నుంచి మానవులకు సోకుతుందని, ముఖ్యంగా ఎలుకలు, చుంచులు, ఉడతలు వంటి జీవుల కారణంగా ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏపీలోని విజయవాడ (Vijayawada)లోకి కూడా మంకీపాక్స్ ప్రవేశించినట్లు సమాచారం. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానించారు. అతడి కుటుంబం ఇటీవలే దుబాయి (Dubai) నుంచి వచ్చింది. అయితే అలా వచ్చిన కొన్ని రోజులకే కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్‌ కేసుగా డాక్టర్లు భావిస్తున్నారు.

Updated Date - 2022-07-25T00:34:20+05:30 IST