ఘనంగా భక్త కనకదాసు జయంత్యుత్సవం

ABN , First Publish Date - 2020-12-04T04:26:24+05:30 IST

భక్తకనకదాసు జయంత్యుత్సవం కన్నుల పండువగా జరిగింది.

ఘనంగా భక్త కనకదాసు జయంత్యుత్సవం
ఆదోనిలో కనకదాసు చిత్రపటాన్ని ఊరేగిస్తున్న కురవలు


ఆదోని, డిసెంబరు 3: భక్తకనకదాసు జయంత్యుత్సవం కన్నుల పండువగా జరిగింది.  క్రాంతినగర్‌ కాలనీకి చెందిన రాము, రాజు, రవి, మల్లికార్జున, ఆది, నాగార్జున, కృష్ణవర్ధన్‌ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని శంభులింగేశ్వర దేవస్థానంలో కనకదాసు చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం నుంచి కనకదాసు చిత్రపటాన్ని పట్టణంలో గొరవయ్యల నృత్యాలతో ఊరేగించారు. రథోత్సవాన్ని కాంత్రినగర్‌ కాలనీలోని లక్ష్మినరసింహ దేవాలయం ఆవరణలో ఉంచారు. వచ్చిన భక్తులకు మధ్యాహ్నం భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 


ఆలూరు రూరల్‌: భక్తకనకదాసు జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పెద్దహోతూరు, అరికెర, కమ్మరచేడు గ్రామాల్లో భక్తకనకదాసు జయంతి సందర్భంగా కురవ సంఘం ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం కనకదాసు చిత్రపటాన్ని ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదోని శ్రీకృష్ణ దేవరాయ పాఠశాల కరస్పాండెంట్‌ హుసేనప్ప, మాజీ ఎంపీపీ పార్వతి, కురవ సంఘం నాయకులు హోతూరప్ప, పూజారి వీరేశ్‌, లక్ష్మన్న, నాగేంద్ర, ఆంజనేయ, ఎర్రిస్వామి, పరుశరామ్‌, రామప్ప, విశ్వనాథ్‌, శేషప్ప పాల్గొన్నారు. 


  కనకదాసు జయంతిని గురువారం కురువ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం స్థానిక రామలక్ష్మణ గుడి దేవస్థానంలో కనకదాసు చిత్రపటానికి పూజలు నిర్వహించి చిత్రపటాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో గొర్రెల ఈశ్వరప్ప, చిన్నబసప్ప, శ్రీధర్‌, బ్యాంకు శ్రీనివాసులు, గణేష్‌, వీరేష్‌, మల్లప్ప, చంద్ర, ముని పాల్గొన్నారు. 


హొళగుంద: మండలంలోని లింగంపల్లి, ఎల్లార్తి, ముద్దటమాగి, కోగిలతోట, పెద్దహ్యాట, ఎండీ హల్లి గ్రామాలతో పాటు హొళగుందలో భక్తకనకదాసు జయంతిని కన్నుల పండువగా నిర్వహించినట్లు కనకశ్రీ యూత్‌ సభ్యులు పెద్దహ్యాట మల్లయ్య, ఎస్కే గిరి, రవి, మహేష్‌, బీరప్ప, పంపా, గాదిలింగ, మౌనేష్‌ గురువారం తెలిపారు. లింగంపల్లి గ్రామంలో కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆలూరు వైసీపీ ఇన్‌చార్జి గుమ్మనూరు నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  


హాలహర్వి: మండలంలోని అన్ని గ్రామాల్లో కనకదాసు జయంతిని ఘనంగా జరుపుకున్నారు. గురువారం విరుపాపురం గ్రామంలో భారీ విగ్రహాన్ని వైసీపీ తాలుకా ఇన్‌చార్జి నారాయణస్వామి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదోని మార్కెట్‌ యార్డు చైర్మన్‌ దేవేంద్రప్ప, కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె శివన్న, మాజీ ఎంపీపీ బసప్ప, విరుపాపురం మల్లికార్జున, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్‌ భీమప్పచౌదరి పాల్గొన్నారు. 


మంత్రాలయం: మంత్రాలయంలో గురువారం భక్త కనకదాసు జయంతి వేడుకలను నిర్వహించారు. మఠం యాజమాన్యం ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహానికి వైసీపీ నాయకుడు సీతారామిరెడ్డి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళి అర్పించారు.  


కోసిగి: కోసిగిలో భక్త కనకదాసు  జయంతి ఘనంగా నిర్వహించారు.  వైసీపీ కన్వీనర్‌ బెట్టన్నగౌడు, వైసీపీ నాయకులు నాడిగేని నరసింహులు, కురువ మల్లయ్య, క్రిష్ణమూర్తి, కురువ వీరేష్‌, జగదీష్‌ స్వామి, సురేష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-04T04:26:24+05:30 IST