ఇంటిదొంగ దొరికాడు.. బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చిన వారిపై దృష్టి..!?

Published: Sat, 14 May 2022 07:54:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇంటిదొంగ దొరికాడు.. బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చిన వారిపై దృష్టి..!?

  • నేడో, రేపో అరెస్టు చూపించే అవకాశం


విజయవాడ : కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కాజేసేందుకు ప్రయత్నించిన ఇంటిదొంగను పోలీసులు పట్టేశారా? నేడో, రేపో నిందితుడి అరెస్టు (Arrest) చూపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. సీసీ టీవీ (CC Tv) కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా హుండీల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న వారిలో బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చిన వారిపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే అమ్మవారి సొత్తును కాజేసేందుకు ప్రయత్నించిన ఇంటిదొంగను పట్టేసినట్టు విశ్వసనీయ సమాచారం. అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న ఓ కిందిస్థాయి ఉద్యోగే దీనికి కారణమని పోలీసులు గుర్తించారని, నేడో, రేపో అరెస్టు చూపే అవకాశముందని భావిస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.