వంటలు
కంది పొడి

కావలసిన పదార్థాలు: కంది పప్పు- రెండు కప్పులు, మినపప్పు- పావుకప్పు, పెసరపప్పు- అరకప్పు, శెనగపప్పు- అరకప్పు, కరివేపాకు- 3 రెబ్బలు ఎండుమిర్చి- 20, వెల్లుల్లిపాయల - ఒకటి, జీలకర్ర- రెండు స్పూన్లు, నూనె, ఉప్పు- తగినంత.


తయారు చేసే విధానం: ఓ పాన్‌లో కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శెనగపప్పును దోరగా వేయించాలి. బాణలిలో కాస్త నూనెవేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు చిటపటలాడించి, పప్పులన్నీ కలిపి ఉప్పు వేసి గ్రైండ్‌ చేస్తే కంది పొడి తయార్‌!

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.