నైపుణ్యాభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2022-06-27T01:48:27+05:30 IST

నైపుణ్యాభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని కందుకూరి ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ కందుకూరి సత్యనారాయణ పేర్కొన్నారు.

నైపుణ్యాభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు
విద్యార్థినికి జ్ఞాపిక బహూకరిస్తున్న కందుకూరి

కావలిటౌన్‌, జూన్‌ 26 : నైపుణ్యాభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని కందుకూరి ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ కందుకూరి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం కో ఆపరేటివ్‌ కాలనీలోని ఎమ్మెస్సార్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిగ్రీతో పాటు స్కిల్‌ డెవల్‌పమెంట్‌పై దృష్టి పెట్టాలని, ట్యాలీపై పట్టు సాధిస్తే కందుకూరి ఇండస్ట్రీ్‌సలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కరస్పాండెంట్‌ రాజ్‌కుమార్‌ చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా విద్య అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బహుళజాతి కంపెనీల్లో ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగాలు పొందిన విద్యార్థులను కందుకూరి మెమోంటోలు బహూకరించి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ టీ ఉమ, వైస్‌ ప్రిన్సిపాల్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T01:48:27+05:30 IST